ETV Bharat / state

తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్టు

author img

By

Published : Jan 3, 2021, 3:19 PM IST

Updated : Jan 4, 2021, 6:28 AM IST

తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని చెన్నైలో పోలీసులు అరెస్టు చేశారు. లింగాల మహిళ హత్య కేసు ఘటనలో తనను అదుపులోకి తీసుకున్నట్లు రవి చెబుతుండగా..2018 మార్చిలో వైకాపా - తెదేపా ఘటనలో అరెస్ట్​ చేసినట్లు కడప ఎస్పీ తెలిపారు.

తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు
తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి (మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి)ని పోలీసులు ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. 2018లో పులివెందులలో జరిగిన ఘర్షణ కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఆదివారం బెంగళూరు నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న రవిని అక్కడి పోలీసులు ప్రత్యేకంగా కూర్చోబెట్టారు. కాసేపటి తర్వాత ఆయనను కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని పులివెందులకు తీసుకువెళ్లారు. రవిని పులివెందుల కోర్టులో సోమవారం హాజరుపరచనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాల గ్రామంలో నాగమ్మ అనే దళిత మహిళ మీద హత్యాచారం విషయంలో నిరసన తెలిపిన బీటెక్‌ రవిపై పోలీసులు ఇటీవల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ‘2018 నాటి ఘర్షణ కేసులో ఆయనను అరెస్టు చేశాం. పులివెందుల అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 117/2018 కేసుకు సంబంధించి అప్పట్లో తెదేపా, వైకాపా వర్గాలపై కేసులు నమోదయ్యాయి. అందులో పలువురికి బెయిలు లభించింది. ఈ కేసులో నిందితుడైన బీటెక్‌ రవిని దర్యాప్తు నిమిత్తం అరెస్టు చేశాం’ అని కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

భయపడే ప్రసక్తే లేదు: రవి

ఒక అంతర్జాతీయ నేరస్థుడిలా పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని, దేశం విడిచి పారిపోతున్నట్లుగా రన్‌వే మీదకొచ్చి అరెస్టు చేశారని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి మండిపడ్డారు. ఒక ఎమ్మెల్సీతో ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఇలాంటి అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, తెదేపా అధికారంలోకి వచ్చేవరకూ జైల్లో ఉండేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆదివారం చెన్నై విమానాశ్రయం నుంచి విడుదల చేసిన వీడియో సందేశంలో బీటెక్‌ రవి మాట్లాడారు. ‘చలో పులివెందుల కార్యక్రమం నిర్వహించినందుకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఎస్సీ మహిళపై హత్యాచారం ఘటనలో డీఎస్పీకి వినతిపత్రం ఇస్తే కేసు పెట్టారు. రెండువారాల క్రితం కేసు నమోదుచేసినా.. దాచిపెట్టారు. కనీసం 41సీ నోటీసులూ ఇవ్వలేదు. పులివెందులలో ఉన్నప్పుడే అరెస్టు చేయవచ్చు కదా..? ఇన్ని వేధింపులు ఎందుకు? కనీసం భోజనం చేసేందుకు అనుమతివ్వడం లేదు. నాతో పాటు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టారు. ఇలాంటివి జగన్‌ హయాంలోనే చూస్తున్నాం’ అని విమర్శించారు.

నిందితులకు రాజమార్గం: అచ్చెన్నాయుడు

న్యాయం చేయాలని అడిగినవారిని అరెస్టు చేస్తూ.. నిందితులకు రాజమార్గం చూపేలా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ‘దళిత మహిళపై హత్యాచారం కేసులో నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ.. ‘చలో పులివెందుల’ కార్యక్రమం చేపట్టిన నేతలపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమే కాకుండా ఎమ్మెల్సీ రవిని అరెస్టు చేశారు’ అని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.

ఇది కక్ష సాధింపే: చంద్రబాబు

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఎస్సీ మహిళపై హత్యాచారం జరిగి నెల గడుస్తున్నా ఇంతవరకు చర్యలు తీసుకోని ప్రభుత్వం.. దానిని నిలదీసినవారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్టు.. ముఖ్యమంత్రి కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘బాధితులకు అండగా ఉండటం తెదేపా నాయకుల నేరమా? నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడం అపరాధమా? ఎస్సీలపై దమనకాండకు పాల్పడేవాళ్ల మీద చర్యలు తీసుకోరా’ అని ప్రశ్నించారు. ‘జగన్‌ పాలనలో నిందితులు నిర్భీతిగా తిరుగుతున్నారు, బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ దుర్మార్గ చర్యలను రాష్ట్ర ప్రజలంతా గర్హించాలి’ అని చంద్రబాబు కోరారు.

తెదేపా చలో పులివెందుల...అడ్డుకున్న పోలీసులు

Last Updated : Jan 4, 2021, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.