కడప శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో అవకతవకలు జరుగుతున్నాయని తెదేపా నేతలు విమర్శించారు. కడప మండలం నానాపల్లి వద్ద పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు కొలతలు వేశారు. ఈ ప్రదేశాన్ని జిల్లా తెదేపా నేతలు హరిప్రసాద్, అమీర్ బాబు, గోవర్ధన్ రెడ్డి బృందం పరిశీలించారు. గత పదిహేనేళ్ల నుంచి రైతులు సాగుచేసుకుంటున్న మామిడి తోటల భూములను లాక్కుని ఇంటి పట్టాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సెంటు భూమి ఇస్తే పేదలు ఎలా ఇళ్లు నిర్మించుకుంటారని అన్నారు.