నిజాయతీ, పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని.. కడప జిల్లా ప్రొద్దుటూరు తెదేపా నాయకుడు సుధాకర్ రెడ్డి విమర్శించారు. అంబులెన్సుల విషయంలో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని విమర్శించారు. పాత సంస్థకు 6 నెలల గడువు ఉన్నప్పటికీ అర్ధాంతరంగా దాన్ని రద్దు చేసి కొత్త టెండర్లు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. అందులో అవినీతికి పాల్పడేందుకే అలా చేశారన్నారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అనేక అక్రమాలు జరిగాయని మరో తెదేపా నేత ముక్తియార్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం గురించి ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. తెదేపా హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
ఇవీ చదవండి.. : 'అవినీతి చేసిన వాళ్లను వదిలేసి.. ప్రశ్నించిన వారిపై కేసులు'