విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తెదేపా నాయకులు కడప జిల్లా రైల్వే కోడూరులో వినూత్నరీతిలో నిరసన చేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో విసనకర్రలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన పాపానికి ఫ్యాన్లు తిరగకుండా చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీచూడండి. పులివెందులలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించాలి: సీఎం