ETV Bharat / state

రాజశేఖర్​రెడ్డి గురించి మాట్లాడే హక్కు తెలంగాణ మంత్రులకు లేదు: తెదేపా నేతలు - Telangana ministers comments

వైఎస్​ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు తెలంగాణ మంత్రులకు లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి కడపలో అన్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ అక్రమంగా నీటిని దొంగతనం చేస్తోందని మండిపడ్డారు. మాకు రావాల్సిన నీటిని వాడుకునే హక్కు ఉందని.. ఎవరైనా కాదు.. కూడదంటే సీమ పౌరుషం చూపిస్తామని హెచ్చరించారు.

tdp leaders outrage on Telangana ministers
తెలంగాణ మంత్రులపై తెదేపా విమర్శలు
author img

By

Published : Jun 26, 2021, 5:06 PM IST

తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ఎనిమిది ప్రాజెక్టులపై తక్షణం సుమోటో కింద కేసు నమోదు చేయాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని దొంగతనం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.

రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు తెలంగాణ మంత్రులకు లేదని.. నోరు అదుపులో ఉంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన మాజీ సీఎం గురించి తెలంగాణ మంత్రులు ఘోరంగా మాట్లాడుతుంటే.. వైకాపా మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. మంత్రులు నాని, అనిల్ కుమార్ యాదవ్, వీళ్లంతా ఏమయ్యారని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. మాకు రావాల్సిన నీటిని వాడుకునే హక్కు ఉందని.. ఎవరైనా కాదు.. కూడదంటే సీమ పౌరుషం చూపిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి. Water dispute: 'రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుకోనున్నాం..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.