ETV Bharat / state

'కొవిడ్​ బాధితులను తెదేపా నేతలు పరామర్శిస్తే వైకాపాకు భయమెందుకు?' - తెదేపా నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డి వార్తలు

కడప జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కరోనా రోగులను.. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పరామర్శించారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు కొవిడ్​ ఆస్పత్రిని సందర్శించి... బాధితులకు ధైర్యం చెప్పారు.

tdp leader
రెడ్యం వెంకట సుబ్బారెడ్డి
author img

By

Published : May 24, 2021, 6:25 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి కొవిడ్​ రోగులను పరామర్శించారు. కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బాధితులకు ధైర్యం చెప్పారు. పార్టీ తమకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కొవిడ్​ రోగులను అంటరాని వారిగా చూడొద్దని… వారిలో ఆత్మస్థైర్యం నింపాలనే ఉద్దేశంతో ఆస్పత్రిని సందర్శించినట్లు చెప్పారు. తెదేపా నేతలు కొవిడ్​ రోగులను పరామర్శిస్తే వైకాపాకు అంత ఉలుకెందుకని ప్రశ్నించారు.

తెదేపా నేతలను గృహ నిర్బంధం చేయటం పట్ల వెంకట సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోపాలను ప్రజలు తెలుసుకోకూడదని సీఎం.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కరోనా వ్యాప్తి వేళ జగన్​… ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. కొవిడ్​ నియంత్రణ కంటే ప్రతిపక్షాలను నియంత్రించేందుకే ముఖ్యమంత్రి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు.

కొవిడ్​ ఆస్పత్రిని, అక్కడ అందిస్తున్న వైద్య సేవలను రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పరిశీలించారు. మెరుగైన వైద్యం, రుచికరమైన భోజనం అందించాలన్నారు. కొవిడ్​ రోగులకు ఆక్సిజన్​ పడకలు దొరికే పరిస్థితి లేదన్నారు. ఇంట్లో ఒకరికి కరోనా వస్తే.. మిగతా వారందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కుటుంబ సభ్యులందరూ కొవిడ్​ బారిన పడి, హోం ఐసోలేషన్​ ఉన్న వారికి.. ప్రభుత్వమే భోజన, వైద్య సేవలు అందించాలన్నారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేసి… 24 గంటల్లో ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 18-45 సంవత్సరాల వారందరికీ వ్యాక్సిన్ వేయాలన్నారు. ఇప్పటివరకు 45 సంవత్సరాలు పైబడ్డ వారికే వ్యాక్సిన్ వేయని పరిస్థితి ఉందని మండిపడ్డారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ఇదీ చదవండి: ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలను తెదేపా మానుకోవాలి: ఆళ్ల నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.