ETV Bharat / state

'భూముల రీసర్వే వల్ల జరిగే ప్రయోజనమేంటి ?' - ఏపీలో భూముల రీసర్వే

భూముల రీసర్వే వల్ల జరిగే ప్రయోజనాలను వెల్లడించాలని తెదేపా నేత శ్రీనివాస్​రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూముల రీసర్వే వల్ల గ్రామాల్లో కక్షలు,కార్పణ్యాలు పెరిగి... ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రక్తపాతం జరిగే ప్రమాదం ఉందన్నారు.

'భూముల రీసర్వే వల్ల జరిగే ప్రయోజనమేంటి ?'

author img

By

Published : Dec 22, 2020, 6:44 PM IST

ముఖ్యమంత్రి జగన్ ఏ మాత్రం ఆలోచించకుండా భూములను రీ సర్వే చేయించటం దారుణమని తెదేపా నేత శ్రీనివాస్​రెడ్డి వ్యాఖ్యానించారు. భూముల రీసర్వే వల్ల గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెరిగి... ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రక్తపాతం జరిగే ప్రమాదం ఉందన్నారు. భూముల రీసర్వే వల్ల జరిగే ప్రయోజనాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైకాపా నాయకుల భూకబ్జా కోసమే రీసర్వే చేయిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇలాగే భూముల రీ సర్వేను ప్రారంభించి నాలుగు నెలల్లోనే ఆపేశారని గుర్తుచేశారు. అభివృద్ధిదాయకమైన పాలన చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్..ప్రజా వేదికను కూల్చటంతో మొదలుపెట్టి ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు.

ఇదీచదవండి

వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే..నేడు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.