కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు స్వయంగా ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. గత పది రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, డాక్టర్ సలహా మేరకు 10 రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఎవరికైనా వ్యక్తిగతంగా అవసరం ఉంటే ఫోన్ కాంటాక్ట్ ద్వారా అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి