కడప జిల్లా ఆకేపాడులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మూడు పోలింగ్ కేంద్రాల్లోని తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఉదయం మాక్ పోలింగ్ సమయంలో వైకాపా నేతలు తెదేపా ఏజెంట్లను బెదిరించారు. ఆ సమయంలో అక్కడికెళ్లిన తెదేపా అభ్యర్థి బత్యాల చంగల్ రాయుడు కలుగజేసుకుని అభ్యంతరం చెప్పటంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం తెదేపా ఏజెంట్లను బయటకు లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి