కడప జిల్లా కాశినాయన మండలం కొట్టాల గ్రామంలో తీవ్ర తాగునీటి కొరత నెలకొంది. సూమారు 300 కుటుంబాలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఉన్న నీటి పథకం వర్షాభావం కారణంగా అడుగంటి పోయింది. చుక్క చుక్క వచ్చే నీటి కోసం రోజంతా కుళాయిల వద్ద నిరీక్షిస్తున్నారు. బిందెడు నీరు దొరకాలంటే గగనంగా ఉంటోందని గ్రామస్తులు అంటున్నారు. తాగునీటి ఇబ్బందులపై గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగు నీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి