ETV Bharat / state

'గంగిరెడ్డి రాజకీయ పలుకుబడి దృష్ట్యా ఏదైనా సాధ్యమే' - వివేకా హత్య కేసు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court made important comments: వివేకా హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గంగిరెడ్డికి రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి ఏదైనా సాధ్యమయ్యే అవకాశాలున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. గంగిరెడ్డి బెయిల్ రద్దుపై మళ్లీ విచారణ జరపాలని ఆదేశిస్తే తెలంగాణ హైకోర్టును ఆదేశించాలా? లేక ఏపీ హైకోర్టును ఆదేశించాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Erra Gangireddy bail petition
ఎర్రగంగిరెడ్డి బెయిల్‌
author img

By

Published : Jan 5, 2023, 5:32 PM IST

Erra Gangireddy Bail Petition: వివేకా హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఎర్ర గంగిరెడ్డికి కడప కోర్టు ఇచ్చిన డీఫాల్ట్‌ బెయిల్‌ ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ రద్దు కోసం సీబీఐ దాఖలు పిటిషన్ పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

ఏ రాష్ట్రాన్ని ఆదేశించాలి: గంగిరెడ్డి బెయిల్ రద్దుపై మళ్లీ విచారణ జరపాలని ఆదేశిస్తే తెలంగాణ హైకోర్టును ఆదేశించాలా? లేక ఏపీ హైకోర్టును ఆదేశించాలా? అంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా అడిగారు. గంగిరెడ్డి బెయిల్ పొందేనాటికి అసలు విచారణే జరగలేదు.. కీలక విషయాలేమీ దర్యాప్తులో బయటకు రాలేదు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో కేసు తీవ్రత నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్​ను రద్దు చేయవచ్చని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో దర్యాప్తు చేసిన ఏపీ పోలీసులు గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ రావడానికే చార్జిషీటు దాఖలుకు జాప్యం చేశారని అనుకోవడానికి ఆస్కారం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. గంగిరెడ్డికి రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి.. ఏదైనా సాధ్యమయ్యే అవకాశాలున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించింది.

సీబీఐ న్యాయవాది నటరాజన్: సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది నటరాజన్ వాదించారు. గంగిరెడ్డికి మెరిట్ పైన కాకుండా డిపాల్ట్​గా బెయిల్ వచ్చిందన్న విషయాన్ని నటరాజన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అటువంటి సమయంలో సాక్ష్యులను బెదిరించినా, ప్రభావితం చేసినా, దర్యాప్తునకు ఆటంకాలు కలిగించినా బెయిల్ రద్దు చేయవచ్చన్న అంశాన్ని నటరాజన్ కోర్టులో ప్రస్తావించారు. సీబీఐ దర్యాప్తు తరువాతనే గంగిరెడ్డి ఏ1 అని నిర్ధారణ అయినందున బెయిల్ రద్దు చేయాలని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏ1 గా నిర్దారణ అయినందునే గంగిరెడ్డిని విచారించాలని భావిస్తున్నామన్న నటరాజన్ వెల్లడించారు.

గంగిరెడ్డి న్యాయవాది ఆదినారాయణరావు: గంగిరెడ్డి అన్ని విధాలుగా విచారణకు సహకరిస్తున్నారన్న ఆయన తరపు న్యాయవాది ఆదినారాయణరావు కోర్టుకు తెలిపారు. కావాలంటే నార్కో పరీక్షలు కూడా చేసుకోవచ్చని స్వచ్ఛందంగా గంగిరెడ్డి ముందు కొచ్చిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.