SC ON YS VIVEKA MURDER CASE : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబర్ 19న విచారణ ముగించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం... అప్పటి నుంచి తీర్పును వాయిదా వేస్తూ వస్తోంది. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో తీర్పు ఇవ్వనున్నట్లు జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం వెల్లడించింది. కాగా నేడు(మంగళవారు) తీర్పు ఇస్తున్నట్లు సంబంధిత న్యాయవాదులకు రిజిస్ట్రీ సమాచారం ఇచ్చింది. రేపు ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే వివేకా హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న విషయంపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బివి నాగరత్నల ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వేరే రాష్ట్రానికి కేసు బదిలీపై తీర్పు తర్వాతే సీబీఐ పిటిషన్‌పై విచారణ చేస్తామని స్పష్టం చేసిన ధర్మాసనం.. కేసు విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: