మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఏ నిబంధనల ప్రకారం ఇంప్లీడ్ అవుతారని హైకోర్టు సునీతార రెడ్డిని ప్రశ్నించగా.. పూర్తి వివరాలు సమర్పిస్తానని ఆమె కోర్టుకు వెల్లడించారు. దీంతో కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదీ చదవండి: వివేకా హత్యకేసులో... మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీఐ