ETV Bharat / state

'పరీక్షా కేంద్రంలో విద్యార్థులు గుంపులుగా చేరితే పరిస్థితి ఏమిటి..?' - పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

దేశంలో, రాష్ట్రంలో కరోనా రెండోదశ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ప్రతిరోజు దేశ వ్యాప్తంగా 3 లక్షలు, రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కొవిడ్ బాధితులతో నిండిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భావి భారత పౌరుల ప్రాణాలను పణంగా పెట్టి.. పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

kadapa people opposing exams
పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తున్న కడప వాసులు
author img

By

Published : Apr 29, 2021, 10:50 PM IST

పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తులు

ఈనెల మొదటి నుంచి కరోనా రెండోదశ దడ పుట్టిస్తోంది. కడప జిల్లాలో ప్రతి రోజు 300 నుంచి 600 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. నాలుగు ప్రభుత్వ, 19 ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసినా.. వసతులు నామమాత్రమే. రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్, రెమ్ డెసివిర్ కొరత ఉంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పరీక్షలు రాయాలంటేనే పది, ఇంటర్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 90 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును, వారి ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ భయాలు- పొగాకు కోసం బారులు

ప్రాణాల కంటే పరీక్షలు ముఖ్యమా..?

భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రాణించాలంటే తప్పనిసరిగా మంచి మార్కులు ఉండాలనే ఉద్దేశంతోనే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ విద్యార్థుల ప్రాణాల కంటే పరీక్షలు ముఖ్యం కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి పెద్దమనసుతో పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నాను. వారిని ఉన్నత తరగతులకు పంపించే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. - వీణా అజయ్ కుమార్, న్యాయవాది.

పరీక్షా కేంద్రంలో గుంపులు గుంపులుగా విద్యార్థులు చేరితే పరిస్థితి ఏమిటనే విషయంపై ఇప్పటి నుంచే విద్యార్థులు ఇళ్ల వద్ద ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు పరీక్షలకు ఎలా సిద్ధమవుతారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సన్నద్ధం కాని విద్యార్థులు ఎలా ఉత్తీర్ణులవుతారని నిలదీస్తున్నారు. పరీక్షల నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

కరోనా నిబంధనలకు నీళ్లు..బిర్యానీ కోసం బారులు !

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.