ETV Bharat / state

వేసవి సెలవులు... ఈత కొలనుల్లో విద్యార్థులు

ఎండ ఠారెత్తిస్తోంది. ఈత కొలను ఆహ్వానిస్తోంది. ఒకప్పుడు వేసవి సెలవులొస్తే... చెరువులు, బావులు విద్యార్థులతో నిండిపోయేవి. కానీ ఇప్పుడు ఈత కొలనులు కిటకిటలాడుతున్నాయి.

ఈత కొలనుల్లో విద్యార్థులు
author img

By

Published : May 15, 2019, 12:03 PM IST

ఈత కొలనుల్లో విద్యార్థులు

చిన్నారులు నీటిలో ఆడుకోవ‌డానికి ఎక్కువ మ‌క్కువ చూపుతారు. ఈత వ‌ల్ల ఉత్సాహం, ఉల్లాసంతోపాటు ఆరోగ్యంగా ఉంటారు. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో విద్యార్థులు ఈత నేర్చ‌కునేందుకు ముందుకొస్తున్నారు. గ‌తంలో బావులు, చెరువుల్లో నేర్చుకునేవారు. ప్రస్తుతం అవి ఎండిపోవ‌డంతో ఈత కొల‌నుల వైపు నడుస్తున్నారు. ఇక్క‌డ శిక్ష‌కుల ప‌ర్య‌వేక్ష‌ణ ఉండ‌టం... లోతు త‌క్కువ‌గా ఉండటం వల్ల విద్యార్థులు ఆస‌క్తి చూపుతున్నారు.

పిల్ల‌ల‌కు వేస‌వి సెల‌వులు రావ‌డంతో చాలా మంది త‌ల్లిదండ్రులు ఈత నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈత వ‌ల్ల శ‌రీరం ధృఢంగా త‌యారై... ఆరోగ్యంగా ఉంటారు. త్వ‌ర‌గా బ‌రువు తగ్గ‌డానికి ఇది చ‌క్క‌టి సాధ‌నం. ఇలా ప్రొద్దుటూరులోని మొత్తం 5 ఈత కొల‌నుల్లో ప్ర‌తిరోజూ వంద‌లాది మంది చిన్నారులు శిక్ష‌ణ పొందుతున్నారు. ఉద‌యం రెండు బృందాలు, సాయంత్రం రెండు బ్యాచ్​ల‌కు త‌ర్ఫీదు ఇస్తున్నారు. ఎర్ర‌గుంట్ల‌, థ‌ర్మ‌ల్‌, జువారితోపాటు చుట్టు ప‌క్క‌ల గ్రామాల నుంచి విద్యార్థులు ప్రొద్దుటూరుకి వ‌చ్చి ఈత నేర్చుకుంటున్నారు.

ఇదీ చదవండి...

తిరుమల ఘాట్​రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_33_14_harati_seva_p_v_raju_av_c4_SD. ap_rjy_33a_14_harati_seva_p_v_raju_av_c4_SD తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నేటి నుంచి హారతి సేవను ప్రారంభించనున్నారు. ప్రతి రోజు రాత్రి7 గంటల నుంచి అరగంట సేపు ప్రధానాలయం లో మూల విరాట్ కు సేవ చేస్తారు. ఇందులో పాల్గొనే భక్తులకు దంపతులకు రూ. 500 రుసుము నిర్ణయించారు. ఈ హారతి సేవకు అవసరమయ్యే వెండి సామగ్రి ని 12 కేజీల వెండి తో దేవస్థానం ధర్మ కర్తల మండలి సభ్యుడు .మాట్టే సత్యప్రసాద్ చేయించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.