కడప జిల్లా కాజీపేట మండలంలోని ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి రాత్రి తేలు కాటుకు గురయ్యారు. వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందంటూ విద్యార్థి సంఘాలు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వార్డెన్‌తో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేయాలని, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు సరైన భద్రత లేదని ఆరోపించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా....కలెక్టర్ విచారించకపోవటం దారుణమని ఖండించారు. కలెక్టర్‌కు ఎస్సీల పట్ల ఉన్న నిర్లక్ష్యం బహిర్గతమైందని కడప విద్యార్థి సంఘ నాయకుడు తెలిపారు. వసతిగృహం నిర్వాహకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ :