రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు చేపట్టాలని కడప జిల్లా రాజంపేట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. ప్రజలకు మాస్కులు అందించటంతోపాటు వలస కూలీలను ఆదుకోవాలన్నారు. మరిన్ని కరోనా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమం తొలగించి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకించామని.. ఇదే సమయంలో హైకోర్టు ప్రభుత్వ చర్యను తప్పు పట్టిందని అన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో వాలంటీర్ల ద్వారా ఆంగ్ల మాధ్యమంపై ప్రభుత్వం సర్వే ఎలా చేపడుతుందో తెలియాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: