కడప జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే వైద్యులకు... మోహన్ ఆసుపత్రి యాజమాన్యం 200 పీపీఈ కిట్లను అందజేసింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీ అవినాశ్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. జిల్లాలో ఈరోజు వరకు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని...వారిలో దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు 16 మంది ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వారు ఇంకా ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. జిల్లాలో కోవిడ్ నివారణకు ప్రభుత్వ ఆదేశాలను పకడ్భందీగా అమలు చేస్తున్నామన్నారు.
ఇదీచదవండి