థాయ్ బాక్సింగ్ వంటి క్రీడల్లో విద్యార్థులు రాణించాలని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సూచించారు. కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి థాయ్ బాక్సింగ్ పోటీలను నిర్వహించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలల్లో, పాఠశాలల్లో కేవలం చదువుకే ప్రాధాన్యమిస్తున్నారని, క్రీడలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే క్రీడలకు ప్రాధాన్యత లభిస్తోందన్నారు.క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని తద్వారా చదువులలో చక్కగా రాణించే అవకాశం ఉందన్నారు.
ఇదీచదవండి