ETV Bharat / state

కోదండరాముడి కల్యాణం... చూద్దాం రారండి - chandrababu

కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణ మహోత్సవం నిర్వహించడానికి తితిదే ఏర్పాట్లు చేసింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండటంతో... అధికారులు, పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ రోజు కోదండరాముడు శివధనుర్భాణ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో తితిదే సదుపాయాలు కల్పిస్తోంది. కల్యాణోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. కడప జిల్లాతోపాటు సీమలోని ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం కడప వైపు, రాజంపేట వైపు రెండు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

కోదండరాముడి కల్యాణం
author img

By

Published : Apr 18, 2019, 6:07 AM IST

Updated : Apr 18, 2019, 10:34 AM IST

నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఐదోసారి ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణ మహోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఏటా జరిగే కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. 2016 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వేడుకలు నిర్వహిస్తోంది. ఆలయానికి సమీపంలో 52 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు. స్వామివారిని కల్యాణాన్ని చంద్రుడు తిలకించే విధంగా వేదిక ముందు వైపు పైకప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్సవ మూర్తులను పల్లకీలో మంగళవాయిద్యాలు, శ్రీవారి సేవకుల కోలాటాల నడుమ కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొవస్తారు. స్వామి వారి కల్యాణానికి ముందు వేదిక వద్ద సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు.

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ...
రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సీతారాముల కల్యాణాన్ని వేద పండితులు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి... కల్యాణం ముగిసే వరకు చంద్రబాబు వేదిక వద్దనే ఉంటారు. సీఎం స్వామివారి కల్యాణంలో పాల్గొనడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఎలాంటి రాజకీయాలు మాట్లాడొద్దని షరతు విధించింది. సీఎంతోపాటు గవర్నర్ నరసింహన్ కల్యాణానికి హాజరుకానున్నారు.

తితిదే భారీ ఏర్పాట్లు...
ఈ వేడుకలకు లక్ష మంది భక్తులు హాజరవుతారనే అంచనాతో... తితిదే ఏర్పాట్లు చేస్తోంది. 60 వేల మంది భక్తులు కూర్చునే విధంగా వేదిక సిద్ధం చేశారు. దాదాపు 20 గ్యాలరీలు పైగానే ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కల్గించేందుకు రెండు పెద్ద కూలర్లు, భారీ జనరేటర్లు అందుబాటులో ఉంచారు. 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లు భక్తుల కోసం తీసుకొచ్చారు. రెండు అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. కల్యాణానికి వచ్చే భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చేందుకు 150 కౌంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 110 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. 1200 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణ వేదిక వద్ద కంట్రోలు రూం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు.

sample description
Last Updated : Apr 18, 2019, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.