కడప జిల్లా పులివెందులలోని సీఎం నివాసం, క్యాంపు ఆఫీసును ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో సీఎం పర్యటన ఖరారు కావడంతో... ఆయన నివాసం వద్ద చేపట్టాల్సిన భద్రతాపరమైన చర్యలను ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులతో చర్చించారు. సీఎంను కలిసి వినతులు అందించేందుకు వచ్చే ప్రజల కోసం... చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై మాట్లాడారు.
ఇదీ చదవండి : 'ఆంగ్ల మాధ్యమం' అమలుకు జీవో జారీ