ETV Bharat / state

సాంకేతికతపై పరిజ్ఞానం పెంచుకోవాలి: ఎస్పీ - కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​ తాజా వార్తలు

పోలీసులు విధి నిర్వహణతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని కడప జిల్లా పోలీస్ అధికారి అన్బురాజన్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై నెల రోజుల పాటు జరగనున్న శిక్షణా కార్యక్రమాన్ని కడపలో ఆయన ప్రారంభించారు.

sp anburajan start training program on technology at kadapa
సాంకేతికతపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలి: ఎస్పీ
author img

By

Published : Oct 12, 2020, 7:41 PM IST

డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థను పటిష్ఠ పరచనున్నట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 2019లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన 61 మందికి సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని కడపలో ప్రారంభించారు. నెల రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలని సిబ్బందికి చెప్పారు.

ముఖ్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలన్నారు. ఓ కేసులో సాక్షులు, ఎఫ్ఐఆర్ నమోదు తదితర వివరాలన్నింటినిపై అవగాహన పెంచుకుని.. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి:

అప్పన్న ఆలయంలో వస్తువుల మాయంపై దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.