కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల గొడవ నేపథ్యంలో... జిల్లా ఎస్పీ అన్బురాజన్, డీఎస్పీ శ్రీనివాసులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు వచ్చారు. దీంతో ట్రిపుల్ ఐటీలోని మెస్-2లో ఈ3 విద్యార్థులు, సెంట్రల్ లైబ్రరీలో ఈ4 విద్యార్థులకు వేరు వేరుగా ఎస్పీ అన్బురాజన్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఘర్షణలు చేసుకోవడం విద్యార్థులకు మంచిది కాదని ఎస్పీ చెప్పారు. గతంలో ఇదే మాదిరి విద్యార్థులు ఘర్షణ పడ్డారని.. మళ్లీ 5 సంవత్సరాల తర్వాత విద్యార్థులు ఘర్షణ పడడం దురదృష్టకరమని అన్నారు.
యూనివర్సిటీలో ఎలాంటి గొడవలు జరిగినా.. క్షమించేది లేదని.. మళ్లీ ఇలాంటి గొడవలు జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. ఘర్షణకు పోయి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు ఎస్పీ సూచించారు. విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు, అధ్యాపకులు దృష్టి పెట్టాలని కోరారు.
ఇదీ చదవండి: నక్సల్స్ చెరలో కోబ్రా కమాండో- నిజమెంత?