ETV Bharat / state

'యువతకు నైపుణాభివృద్ధి శిక్షణ ఇవ్వాలి' - industries of kadapa

కడప జిల్లాలోని పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా యువతకు నైపుణాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్లలతో కలిసి జిల్లాస్థాయి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

skills development committee meeting in kadapa district
జిల్లాస్థాయి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం
author img

By

Published : Jan 12, 2021, 12:31 PM IST

నైపుణ్యాభివృద్ధి నిధిగా కడప జిల్లాను తీర్చిదిద్దాలని కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. ఆ దిశగా జిల్లాలో చదువుకున్న యువతకు ఆసక్తి గల రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు ఉండాలన్నారు. పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించేలా కార్యాచరణ ప్రణాళికలు వెంటనే రూపొందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్లు సీఎం సాయి కాంత్ వర్మ, పి ధర్మ చంద్రారెడ్డిలతో కలిసి జిల్లాస్థాయి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లావాసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసుకుని పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు.

ప్రఖ్యాతి చెందిన అపాచీ లెదర్, ప్లాస్టిక్ సంబంధించి నీల్ కమల్, ఎలక్ట్రానిక్ పరంగా డిక్సన్, విజన్ టెక్, ఎలక్ట్రికల్ మోటార్​కు సంబంధించి పిట్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా జిల్లాలో నెలకొల్పడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇవే కాక కొప్పర్తిలో కూడా ఇంకా పరిశ్రమలో రాబోతున్నాయి. వీటన్నింటిలో వేలమంది యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి

ఇదీ చదవండి

ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి: ఉప ముఖ్యమంత్రి అంజాద్​బాషా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.