ETV Bharat / state

కారుతో ఎస్సైని ఢీకొట్టి... కొంత దూరం తీసుకెళ్లి..

కడప జిల్లా పులివెందులలో మద్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి బరితెగించాడు. కారుతో ఎస్సైను ఢీకొట్టి కొంతదూరం తీసుకెళ్లాడు. ఎస్సై చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు.

si-was-hit-by-a-car
si-was-hit-by-a-car
author img

By

Published : Aug 28, 2020, 11:34 PM IST

Updated : Aug 28, 2020, 11:49 PM IST

కడప జిల్లా పులివెందులలో మద్యం మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా ఎస్సైనే వాహనంతో ఢీ కొట్టి పారిపోయేందుకు యత్నించాడు ఓ వ్యక్తి. అయితే ఎసై త్రుటిలో తప్పించుకున్నారు.

కారుతో ఎస్సైని ఢీకొట్టి... కొంత దూరం తీసుకెళ్లి..

కారులో మద్యం అక్రమంగా రవాణా అవుతోందన్న సమాచారంతో ఎస్సై గోపీనాథ్ రెడ్డి శుక్రవారం పులివెందులలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ వాహనం రాగానే దానిని నిలిపేందుకు ఎస్సై యత్నించాడు. కానీ అందులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని నిలపకుండా.... ఎస్సైని ఢీ కొట్టి కొంత దూరం తీసుకెళ్లారు. వాహనంపై ఉన్న ఎస్సై... చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారు అద్దాలను పగలగొట్టి డ్రైవర్​ను​ అదుపులోకి తీసుకున్నారు. ఆ కారును, అందులో ఉన్న 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Aug 28, 2020, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.