కడప జిల్లా రాజంపేటలో పలు చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు పని చేయకపోవడంతో ప్రజలు మండుటెండల్లో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని బండ్రాళ్ళవీధి, ఎర్రబల్లి, బంగ్లా వీధి తదితర ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు మొరాయించాయి. చౌకధరల సరకుల కోసం ప్రజలు ఉదయం ఆరు గంటల నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. అయితే యంత్రాలు పని చేయనందున చేసేదేమీ లేక వెనుతిరుగుతున్నారు.
ఇదీ చదవండి.