కడపజిల్లా కమలాపురం పశువైద్యశాలలో మందులకొరత ఏర్పడిందని రైతులు అన్నారు. అరకొరగా మందులిస్తూ వెటర్నటి సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపురంలో ఉపసంచాలకుడుగా పనిచేసే హేమంత్ కుమార్‌ను రైతులు నిలదీశారు. సమయపాలన పాటించట్లేదని... ఇష్టమొచ్చిన సమయానికి వస్తున్నారని మండిపడ్డారు. పశువులకు మందులు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంపించే స్టాక్‌ను ఏం చేస్తున్నారని అడిగారు. మందులు ఇవ్వలేనప్పుడు..ఆసుపత్రిని నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు.
ఏడీని వివరణ కోరగా..ఆసుపత్రికి ఎన్ని మందులస్తున్నాయో అవి మాత్రమే ఇస్తున్నామని హేమంత్ కుమార్ తెలిపాడు. నెలవరకే మందులు వస్తాయని అవే ఇస్తున్నామని అన్నారు. ఆసుపత్రిలో మందులు లేకపోతే...మా ఇంట్లో నుంచి ఇవ్వాలా అని ఆయన మండిపడ్డాడు.
ఇదీ చూడండి. షేర్‌చాట్ కోసం బాలుణ్ని చంపేశాడు... కిడ్నాప్ డ్రామా ఆడి దొరికిపోయాడు...