కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి అధికారులు వలసకూలీలను తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 98 మందిని పంపారు. మూడు బస్సుల ద్వారా ఆర్టీసీ బస్టాండ్ నుంచి వారిని స్వస్థలాలకు తరలించారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి బస్సులో ఎక్కించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్, తహసీల్దారు చెండ్రాయుడు దగ్గరుండి వారిని పంపారు. తమ స్వస్థలాలకు వెళుతుండటంతో వలస కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇది చదవండి 'ప్రజలు బాధపడితే ప్రభుత్వాలకు మనుగడ ఉండదు'