కడప జిల్లా జమ్మలమడుగులోని పలు చోట్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు జరిపి.... ఇసుక అక్రమ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 2వేల650 టన్నుల(సుమారు 660 ట్రాక్టర్ల) ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. జమ్మలమడుగు పట్టణంలోని మునిరెడ్డి కాలనీలో 1200 టన్నులు, రామ్రెడ్డిపల్లి మోటు ఫ్యాక్టరీలో 150 టన్నులు, జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామంలో 250 టన్నులు, పెద్దపసుపుల రోడ్డులో సుమారు 1050 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చక్రవర్తి హెచ్చరించారు.
ఇదీ చదవండి
వేల టన్నుల ఇసుక అక్రమ నిల్వలు స్వాధీనం
జమ్మలమడుగులో ఇసుక అక్రమ నిల్వలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు జరిపారు. సుమారు 2 వేల 650 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.