కడప ప్రెస్ క్లబ్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మాలలను చైతన్యపరిచి తమకు రావాల్సిన హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌కుమార్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కరోనాతో ఎంతో మంది చనిపోతున్నా ఎన్నికల అధికారి మాత్రం ఎన్నికలు నిర్వహించాలనడం దారుణమని ఖండించారు. రెండో విడత వ్యాక్సిన్ విడుదలై అందరికీ వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం, భాజపా, జనసేనలు మత తత్వాలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో లక్ష మందితో పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: కత్తితో దాడి... యువకుడికి గాయాలు
'ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించాలనడం దారుణం' - Ex SC Corporation Chairmen Karem Shivaji Comments on State election commissioner
రాష్ట్రంలోని మాలలను చైతన్యపరిచి తమకు రావాల్సిన హక్కుల కోసం కృషి చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ప్రతి జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కరోనాతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నప్పటికి ఎన్నికల అధికారి మాత్రం ఎన్నికలు నిర్వహించాలనడం దారుణమని ఖండించారు.
కడప ప్రెస్ క్లబ్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మాలలను చైతన్యపరిచి తమకు రావాల్సిన హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌కుమార్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కరోనాతో ఎంతో మంది చనిపోతున్నా ఎన్నికల అధికారి మాత్రం ఎన్నికలు నిర్వహించాలనడం దారుణమని ఖండించారు. రెండో విడత వ్యాక్సిన్ విడుదలై అందరికీ వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం, భాజపా, జనసేనలు మత తత్వాలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో లక్ష మందితో పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: కత్తితో దాడి... యువకుడికి గాయాలు
TAGGED:
kaaram siviji