కడప జిల్లా చిట్వేలు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. మండలంలోని ఎస్సీల భూములను తహసీల్దార్ ఖాజాబీ ఇతర వర్గాల వారికి ఆన్లైన్ చేసి తమకు కాకుండా చేశారంటూ ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని తహసీల్దార్ ఖాజాబీని విధుల నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఎస్సీలకు చెందిన భూములను తమకే కేటాయించాలని తెలిపారు. లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :