రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గంలోని వేంపల్లి, కుమ్మరాంపల్లి, పాపాగ్ని ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు.. అక్కడకు చేరుకొని 11 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ ఏడీ బాలసుబ్రమణ్యం, ఆర్ఐ, అధ్వర్యంలో ఆ ట్రాక్టర్లను వేంపల్లి ఠాణాకు తరలించారు.
అయితే ఏం జరిగిందో తెలియదు గానీ... ఎలా వచ్చిన ట్రాక్టర్లను అలాగే బయటకు పంపించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిని పట్టుకున్న అధికారులు మాత్రం మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న స్థానికులు రాజకీయ నాయకుల అండ చూసుకునే ఇసుక మాఫియా రెచ్చిపోతుందంటూ ఆరోపించారు.
ఇవీ చూడండి...