ETV Bharat / state

ఇసుక కోసం పాట్లు... బారులు తీరిన ట్రాక్టర్లు - drivers agitation

కడప జిల్లా శేషమాంబపురంలో ఇసుక క్వారీ ఉంది. నిర్వహణ లోపం కారణంగా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు బారులు తీరటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇసుక ట్రాక్టర్లు
author img

By

Published : Aug 1, 2019, 11:52 PM IST

ఇసుక కోసం పాట్లు... బారులు తీరిన ట్రాక్టర్లు...

ఇసుక క్వారీలో నిర్వహణ లోపం కారణంగా గందరగోళం ఏర్పడింది. కడప జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది ట్రాక్టర్లు బారులు తీరాయి. ఫలితంగా రాకపోకలు స్తంభించిపోయి ఎక్కడి ట్రాక్టర్లు అక్కడే నిలిచిపోయాయి. కడప జిల్లా రాజంపేట మండలం శేషమాంబాపురంలో ఇసుక క్వారీ ఉంది. జిల్లాలో రెండు ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వం క్వారీలకు అనుమతివ్వడంతో కడప, రాయచోటి, బద్వేలు, రైల్వేకోడూరు నుంచి వందలాదిగా ట్రాక్టర్లు క్వారీ వద్దకు వచ్చాయి. జిల్లాలో ఇసుక క్వారీని రద్దుచేసి కొత్త ఇసుక విధానాన్ని సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో సమస్య తీవ్రమైంది. తెల్లవారుజామునే 5 గంటలకు వచ్చిన ట్రాక్టర్లు మధ్యాహ్నం 12 గంటలకు కూడా క్వారీ నుంచి బయటికి పోలేని పరిస్థితి ఏర్పడింది. ఆహారం లేక ఇబ్బంది పడాల్సి వస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి రంగంలోకి దిగారు. ట్రాక్లర్లను అక్కడి నుంచి పంపేశారు. రాజంపేట ప్రాంతంలో ఒకటే క్వారీ ఉండడంతో సమస్య ఏర్పడిందని, త్వరలో కొత్త క్వారీలు మంజూరు కానున్నట్లు తహసీల్దార్ తెలిపారు.

ఇది కూడా చదవండి

''పిల్లలూ.. పాఠాలు అర్థమవుతున్నాయా?''

Intro:AP_TPG_06_01_GOPALAMITRA_DHARNA_AVB_AP10089నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న గోపాల మిత్రులను గ్రామ సచివాలయంలో నియమించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద గోపాలమిత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Body:పశుసంవర్ధక శాఖలో గోపాల్ మిత్రులుగా గత 20 సంవత్సరాలుగా రాష్ట్రంలో రెండు వేల 900 మంది గోపాల మిత్రులుగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. గోపాల మిత్రులు రైతు ఇంటి ముంగిట కృత్రిమ గర్భధారణ పశు వైద్య సలహా మేరకు ప్రాథమిక చికిత్స, పశుసంవర్ధక శాఖ వారికి రైతులకు మధ్యవర్తి గా ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలను 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో గోపాల మిత్రులను ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్ గా నియమించాలని కోరారు. గోపాల మిత్రులు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమని గ్రామ సచివాలయంలో నియమించే వరకు రోడ్డుమీద నిరసన తెలుపుతామని తెలిపారు.

Conclusion:బైట్. సుబ్బారెడ్డి అసోసియేషన్ అధ్యక్షులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.