కడపలో 32వ ఆర్టీసీ భద్రతా మాసోత్సవాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఆదాం సాహెబ్ ప్రారంభించారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం మేరకు డ్రైవర్ల తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఏకాగ్రతతో బస్సులు నడిపితే ఎలాంటి ప్రమాదాలు దరిచేరవని పేర్కొన్నారు. కడప జిల్లాలో గడిచిన ఏడాదిలో కేవలం ఆర్టీసీ ప్రమాదాల వల్ల 32 మంది దుర్మరణం చెందారని తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో నైపుణ్యం కలిగినప్పటికీ చిన్న చిన్న లోపల వల్ల ప్రమాదాలు చేస్తున్నారని చెప్పారు. విధులకు వచ్చే ముందు ఎలాంటి ఆలోచనలు రాకుండా ప్రశాంతమైన మనసుతో రావాలని సూచించారు. ప్రయాణికులను గమ్యస్థానం చేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, ఆర్టీవో శాంతకుమారి ఉన్నారు.
ఇదీ చదవండి: