కడప జిల్లా రాజంపేటలో ముసుగు దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా రాజంపేట సరస్వతిపురంలో అర్ధరాత్రి ముసుగు ధరించి ఇంటి బీగాలను తొలగించే ప్రయత్నం చేశారు. స్థానిక ప్రజలు అప్రమత్తం అయినందున ఎవరికీ చిక్కకుండా పరారయ్యారు. తాజాగా రాజంపేట బైపాస్‌లో రైల్వేకోడూరు మార్గంలోని టైల్స్ విక్రయించే మూడు దుకాణాల్లో చొరబడ్డారు. ఎవరూ గుర్తు పట్టని విధంగా ముఖానికి ముసుగులు ధరించి చేతులకు గ్లౌజులు వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ ఓ దుకాణంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైయ్యాయి. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :