గుంటూరులో...
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్వహించే జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు గుంటూరులో వినూత్నంగా నిర్వహించారు. 'యువశక్తితో మార్పు' అనే నినాదంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గుంటూరు ఉపరవాణా కమిషనర్ మీరాప్రసాద్ తెలిపారు. ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మీరాప్రసాద్ చెప్పారు.
కడప..
నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని కడప రవాణాశాఖ అధికారి శాంతకుమారి సూచించారు. కడపలో రవాణా, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శిరస్త్రాణం ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగర వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రొద్దుటూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో ఆర్టీవో వీర్రాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 'అమ్మ జన్మనిస్తే... హెల్మెట్ పునర్జన్మనిస్తుంది', 'బైక్పై సాహస కృత్యాలు చేయకండి' వంటి ప్లకార్డులు పట్టుకొని అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి :