మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి అన్నారు. కరోనా కారణంగా 500మంది చనిపోతే.. రోడ్డు ప్రమాదాల వల్ల జిల్లాలో ఏడాదికి 400 నుంచి 500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. కడప కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో 32వ రహదారి భద్రతా వారోత్సవాలను ప్రారంభించి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అతివేగం వల్ల కలిగే కష్ట, నష్టాలను సీడీ రూపంలో ప్రజలకు చూపించారు. నెల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు