కడప జిల్లా మైలవరంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ.. జమ్మలమడుగు-ముద్దనూరు వద్ద ఘాట్ దిగుతున్న సమయంలో గేర్ రాడ్ ఊడిపోయింది. దీంతో లారీ అదుపు తప్పి రైల్వే గేట్లను ధ్వంసం చేసుకుంటూ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు మరో గదిలో నిద్రిస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఓబులేసు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి