కడప జిల్లా గోపవరం మండలం రాచాయిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలిక మృతి చెందింది. ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్న ఆరేళ్ల బాలికను ఆటో ఢీకొట్టి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బద్వేలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా బాలిక మృతి చెందింది. ఆటో ప్రయాణికురాలు సుశీలమ్మకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి :