కడప జిల్లా గండికోట జలాశయం పరిధిలోని ముంపు గ్రామ ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. జలాశయం పరిధిలోని తాళ్ల పొద్దుటూరు గ్రామం బీసీ కాలనీలో నీళ్లు చేరుతున్నాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు . గండికోట జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 13.3 టీఎంసీలకు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. నీటిమట్టం పెరగడంతో కాలనీవాసులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. పరిహారం సొమ్ము అందనివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: సోమశిల వెనకజలాలతో మునిగిన వంతెన... నిలిచిన రాకపోకలు