కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు సాంకేతికత సాయంతో కొత్త తరహా విధానాలు రూపొందిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. అభివృద్ధిలో భాగంగా.. మైక్రో ప్లానింగ్ విధానాన్ని అమలు చేసేందుకు అన్ని పనులు పూర్తయ్యాయని, శాస్త్రీయ పద్ధతిలో చెత్త సేకరణ చేపడతామని ఆయన చెప్పారు. మున్సిపాలిటీలోని పారిశుద్ద్య విభాగం, టౌన్ ఫ్లానింగ్, రెవిన్యూ విభాగాలను మైక్రో ప్లానింగ్ లో చేర్చి సంయుక్తంగా పనిచేస్తామన్నారు. భవిషత్తులో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా నిర్దేశిత నమూనా ప్రకారం.. చెత్త సేకరణ వేగవంతం చేసేందుకు, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆధునాతన పరికరాలను వినియోగిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. త్వరలోనే మైక్రో ప్లానింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఇవి చూడండి....ఆ చెట్టుపై చెయ్యేస్తే 14ఏళ్లు జైల్లో కూర్చోవలసిందే