కరోనా మహమ్మారితో కడప జిల్లాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా ఆర్టీసీ అద్దె బస్సుల పరిస్థితి దారుణంగా మారింది. ఐదు నెలల నుంచి బస్సులను బయటికి తీయలేదు. లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి బస్సులను నిలిపేశారు. కానీ మే 21 నుంచి తిరిగి ఆర్టీసీ బస్ సర్వీసులను ప్రారంభించినా అద్దె బస్సులు మాత్రం రోడ్డు ఎక్క లేదు. ఈ కారణంగా జిల్లాలోని 290 అద్దె బస్సులు ఖాళీగా ఉంటున్నాయి. వాహనాలపైనే ఆధారపడి జీవిస్తున్నామని... అద్దె బస్సులను సైతం నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు.
జిల్లాలో రోడ్డెక్కని ఆర్టీసీ అద్దె బస్సులు... యజమానుల్లో ఆందోళన
కరోనా ప్రభావంతో 30శాతం బస్సులు తిరిగేందుకే ప్రభుత్వం అనుమతించింది. ఈ కారణంగా ఆర్టీసీ అద్దె బస్సులు ఇంకా రోడ్డెక్కేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కడప జిల్లాలో 290 బస్సులుండగా అవన్నీ మూలనపడ్డాయి. బస్సుల మీదే ఆధారపడి జీవిస్తున్నామని... అద్దె బస్సులను తిప్పేందుకు అనుమతివ్వాలని యజమానులు వేడుకుంటున్నారు.