ETV Bharat / state

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ భాస్కరన్​ సహా మరో 16మంది అరెస్ట్

author img

By

Published : Jan 9, 2021, 5:12 PM IST

Updated : Jan 9, 2021, 7:56 PM IST

కడపజిల్లాలోని అరుదైన ఎర్రచందనాన్ని దేశ సరిహద్దులు దాటించడానికి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు. చెన్నైకి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ భాస్కరన్... జిల్లాలో ముఠాలను ఏర్పాటు చేసుకుని ఎర్రచందాన్ని కొల్లగొడుతున్నాడు. తమిళనాడు, కర్నాటకలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని విలువైన సంపదను విదేశాలకు తరలించినట్లు పోలీసు విచారణలో తేలింది. అంతర్జాతీయ స్మగ్లర్ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు

redsandle smugglers arrested by kadapa police
అంతర్డాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సహా మరో 16మంది అరెస్ట్

చెన్నైకి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ భాస్కరన్... చెన్నైలో రాజకీయ పలుకుబడి కొనసాగిస్తూనే అరుదైన ఎర్రచందనాన్ని అక్రమార్గంలో విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసు విచారణలో తేలింది. 2016 నుంచి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్​గా అవతారమెత్తిన భాస్కరన్... కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో తన ముఠాలను ఏర్పాటు చేసుకుని ఎర్రచందనం కొల్లగొట్టాడు. జిల్లాలో భాస్కరన్ మీద 21 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇతను కర్నాటక రాష్ట్రంలోని కటిగెనహళ్లి, తమిళనాడులో స్థావరాలు ఏర్పాటు చేసుకుని తన అనుచరుల ద్వారా జిల్లా నుంచి ఎర్రచందనాన్ని తరలించి నిల్వ చేసేవాడు.

తమిళనాడు, కర్నాటక ప్రాంతాల్లో నిల్వ ఉంచిన ఎర్రచందాన్ని సమయం చూసుకుని విదేశాలకు భాస్కరన్​ తరలించే వాడని పోలీసు విచారణలో తేలింది. ఇతనికి పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లతో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతను గతంలో చెన్నై కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కి జైలుకెళ్లొచ్చిన తర్వాత... మళ్లీ యథాప్రకారం ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది.

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అన్బురాజన్ రెండు నెలల నుంచే తమిళనాడు, కర్నాటక ప్రాంతాల్లో తమ పోలీసు బృందాలతో నిఘా పెట్టారు. ఇప్పటికే పలువురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు... శనివారం తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ భాస్కరన్​ను చిత్తూరుజిల్లా పుత్తూరు-తమిళనాడు సరిహద్దులో అరెస్ట్ చేశారు. చెన్నైలోని అన్నానగర్​కు చెందిన ఇతని వద్ద నుంచి తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 290 గ్రాముల బంగారం రికవరీ చేశారు.

తమిళనాడులో భాస్కరన్ అదుపులోకి తీసుకున్న జిల్లా పోలీసులు... అతనిచ్చిన సమాచారంతో జిల్లాలోని మూడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. భాస్కరన్ ఆదేశాల మేరకు కడపకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ రాఘవేంద్రరెడ్డి ముఠా జిల్లాలో ఎర్రచందనం కొల్లగొడుతోంది. రాఘవేంద్రరెడ్డి గతంలో కర్నూలులో జరిగిన ఓ హత్య, హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. రాయచోటి, బద్వేలు, మైదుకూరు, రాజంపేట పోలీసులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 17 మందిని అరెస్ట్ చేసినట్లు ఓఎస్డీ దేవప్రసాద్ తెలిపారు. స్మగ్లర్ల నుంచి కోటి రూపాయల విలువ చేసే 1.3 టన్నుల ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నైకి చెందిన భాస్కరన్​కు కొందరు రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఇతన్నీ కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తామని ఓఎస్డీ దేవప్రసాద్ తెలిపారు.

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సహా మరో 16మంది అరెస్ట్

ఉప్పర్​పల్లిలో ఒకరు అరెస్ట్.. మరో ముగ్గురు పరార్

జిల్లాలోని గోపవరం మండలం ఉప్పర్​పల్లి గ్రామంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్​ను.. బద్వేలు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు స్మగ్లర్లు పరారైనట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు.

ఇదీ చదవండి:

పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం

Last Updated : Jan 9, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.