కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి పెరిగింది. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, వేంపల్లె, బద్వేలు ప్రాంతాల్లో 19 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ప్రొద్దుటూరులో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ దిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారివేనని అధికారులు నిర్ధారించారు. జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌జోన్, బఫర్ జోన్లుగా ప్రకటించారు. కరోనా బాధితులకు జిల్లా కొవిడ్-19 ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారితో సన్నిహతంగా మెలిగిన వారిని క్వారంటైన్ సెంటర్లో పెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కడపలో మరో 2 రోజుల్లో కరోనా పరీక్షలు నిర్ధారించే కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చూడండి: