ETV Bharat / state

19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఒకరి అరెస్ట్ - బాలపల్లెలో ఎర్రచందనం స్మగ్లింగ్ వార్తలు

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లె అటవీ శాఖ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 19 ఎర్రచందనం దుంగలను టాస్క్​ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక స్మగ్లర్​ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

red sandle smugling in balapalle forest in kadapa district
19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
author img

By

Published : Aug 28, 2020, 7:46 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లె అటవీ శాఖ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 19 ఎర్రచందనం దుంగలను టాస్క్​ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక స్మగ్లర్​ను అరెస్ట్ చేశారు. దీని గురించి డీఎస్పీ వెంకటయ్య వివరాలు తెలియజేశారు.

'మాకు అందిన సమాచారంతో గురువారం రాత్రి బాలపల్లి రేంజ్​లో కూంబింగ్ నిర్వహించాం. నెమళ్లగుట్ట సమీపంలోని మామిడి తోటలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు దుంగలను తీసుకెళుతూ కనిపించారు. మేం దాడిచేయగా దుంగలను వదిలేసి పారిపోయారు. సిగమాల శ్రీనివాసులు అనే ఒక స్మగ్లర్ చిక్కాడు. అతను ఒక పాఠశాల బస్సు డ్రైవర్​గా పనిచేస్తూ స్మగ్లింగ్​కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. మొత్తం 19 దుంగలను స్వాధీనం చేసుకున్నాం. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నాం' అని డీఎస్పీ తెలిపారు.

ఇవీ చదవండి..

అచ్చెన్న కేసు: అరెస్టు నుంచి బెయిల్ మంజూరు వరకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.