రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఏడు ఎర్రచందనం దుంగలను, ఎనిమిది మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు ఎర్రచందనం దుంగల విలువ దాదాపు లక్షా 50 వేల రూపాయలు ఉంటుందని ఎస్సై పెద్ద ఓబన్న తెలిపారు. 8 మంది ఎర్రచందనం కూలీలు రైల్వేకోడూరు స్థానిక గ్రామాల వారిగా గుర్తించామన్నారు.
మరోవైపు చిట్వేలు మండలంలో సిద్ధారెడ్డిపల్లి ఎస్సీ కాలనీ సమీపంలో తరలించడానికి సిద్ధంగా ఉంచిన మూడు ఎర్రచందనం దుంగలను, ముగ్గురు ఎర్రచందనం కూలీలను చిట్వేలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్టు తెలిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: యువకుడిపై కత్తితో దాడి.. ప్రేమ వ్యవహారమే కారణమా?