ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో.. కడప జిల్లా రాయచోటి, సిద్ధవటం కడప అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేశారు. నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలు స్వాధీనం చేసుకొని, ఏడుగురు తమిళనాడు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు కర్నూలు రేంజ్ సీఎఫ్ఓ రామకృష్ణ వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: