జిల్లా కేంద్రానికి రాయచోటి అన్ని విధాలా అనుకూలమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నూతన జిల్లాల ఎంపికలో రాయచోటిని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా అనుకూలమని సూచించారు. అన్ని అర్హతలున్న రాయచోటిలో కనీసం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాజంపేట, తంబల్లపల్లె, మదనపల్లె, పీలేరు తదితర అసెంబ్లీ నియోజక వర్గాలకు రాయచోటి కేంద్రంగా ఉండడంతో పాటు అన్ని విధాలా అనుకూలంగా ఉందన్న అంశాలను పూర్తిస్థాయి నివేదికలతో ప్రభుత్వం నియమించిన కమిటీకి నివేదిస్తానన్నారు. రాయచోటి నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన కమిటీకి నియోజకవర్గంలోని మేధావులు, విద్యావంతులు, అన్ని వర్గాల ప్రజలు వారి ఆలోచనా విధానాల మేరకు రాయచోటి జిల్లా కేంద్రం కావాలని నివేదికలు సమర్పించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: 'కడప జిల్లాకు ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారు'