ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయంలో రేషన్​ వాహనాలు విడిచిన వెళ్లిన ఆపరేటర్లు - జమ్మలమడుగు వార్తలు

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలు నిలిచిపోయాయి. తక్కువ జీతం, ఎక్కువ శ్రమతోపాటు సొంత డబ్బు ఖర్చవుతోందని ఆపరేటర్లు వాపోతున్నారు.

నిలిచిన రేషన్​ వాహనాలు
తహసీల్దార్​ కార్యాలయంలో రేషన్​ వాహనాలు విడిచిన వెళ్లిన ఆపరేటర్లు
author img

By

Published : May 2, 2021, 12:45 AM IST

ఇంటింటికీ బియ్యం అందించాలని ప్రభుత్వం తెచ్చిన రేషన్​ పంపిణీ వాహనాలు కడప జిల్లాలో నిలిచిపోయాయి. సీఎం సొంత జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఎండీయూ ఆపరేటర్లు వాటిని వదిలి వెళ్లారు. అతి తక్కువ వేతనానికి హమాలీలు దొరకడం కష్టంగా మారిందని అందువల్ల ఆ పని భారం అంతా తమ మీద పడుతుందని వారు వాపోతున్నారు.

ఆదాయానికి ఖర్చులకు పొంతన లేదు..

నెలకు రూ. 21 వేలు జీతం ఇస్తున్నప్పటికీ.. అందులో ఎక్కువ శాతం బ్యాంక్​లో కట్టింగ్​లు, హమాలీల చెల్లింపులు, వాహన ఈఎంఐలకే పోతోందని.. దీని వల్ల తమకు ఏమీ మిగలడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీనిపై కలెక్టర్​, తహసీల్దార్​కు విన్నపం చేసుకున్నప్పటికీ పరిస్థితుల్లో ఎటవంటి మార్పు రాలేదని వారు అంటున్నారు. అధికారుల నుంచి తమ సమస్య పరిష్కారానికి ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల భారం మోయలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

రూ. 5.6 కోట్లు విలువైన ఎర్ర చందనం పట్టివేత

కరోనా దెబ్బకు.. చేనేత పరిశ్రమ అతలాకుతలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.