ETV Bharat / state

అత్యాచారం చేశాడు..ఆపై పాడుబడిన బంగ్లాలో..!

author img

By

Published : Jun 14, 2020, 10:57 AM IST

Updated : Jun 14, 2020, 1:13 PM IST

అత్యాచారం చేసి.. బాధితురాలిని చంపేసి పారిపోయే.. కథలు చూశాం. మహిళలకు నరకం చూపించి.. ఆ తర్వాత.. పరారై.. ఎక్కడో తలదాచుకునే.. వార్తలు చదువుతూనే ఉన్నాం. కానీ ఓ వ్యక్తి.. అత్యాచారం చేసి.. ఆపై ఆమెను ఎవరికీ చెప్పొద్దంటూ బతిమిలాడుకుని.. తానే ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది?

rape accused sucide in kadapa
rape accused sucide in kadapa

కడప జిల్లాకు చెందిన తిరుపతి భార్యను వదిలేశాడు. తాళ్లపాకలో ఉంటున్నాడు. అతడు ఉంటున్న ఇంటి పక్కనే ఓ మహిళ కాపురం ఉండేది. వారి కుటుంబంతో తిరుపతి అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు. ఈ నెల 11న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తిరుపతి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు ఏదో అయిందని.. బాధితురాలి బంధువులకు చెప్పాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే.. అంతకు ముందే బాధితురాలిని ఎవరికీ చెప్పొద్దని.. తన పరువు పోతుందని వేడుకున్నాడు.

బాధితురాలి బంధవులు ఆమెను ఓ ఆస్పత్రిల్లో చేర్పించారు. ఈ క్రమంలో తిరుపతిపై కేసు నమోదై.. పోలీసులు విచారణ మెుదలుపెట్టారు. అప్పుడే.. తిరుపతికి భయం పట్టుకుంది. తాళ్లపాక సమీపంలోనే.. ఓ పాడుబడిన బంగ్లాలోకి వెళ్లాడు. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బంగ్లా నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు మన్నూరు పోలీసులు సమాచారం అందించారు. అప్పటికే చనిపోయి రెండు రోజులైంది. పోలీసులు వెళ్లేసరికి.. అప్పటికే.. తిరుపతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఈ మేరకు ఘటన వివరాలను డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి వివరించారు.

ఇదీ చదవండి: అప్పు చెల్లిస్తానని పిలిచి అత్యాచారయత్నం

Last Updated : Jun 14, 2020, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.